నాని ప్యారడైజ్ సినిమాకు ప్రత్యేక ప్రీమియర్లు మరియు టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న భారీ చిత్రం ప్యారడైజ్ ప్రదర్శనలకు తెలంగాణ ప్రభుత్వం అధికారిక అనుమతులు మంజూరు చేసింది. సెప్టెంబర్ 23న సాయంత్రం 6.30 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఒక్కో టికెట్ ధరను రూ. 500గా నిర్ణయించారు. అలాగే సాధారణ విడుదల రోజు నుంచి రెండు విడతల్లో టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.