సొంత సర్కార్ తీరుపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: శివ
స్థలం: Hyderabad
సొంత పార్టీ ప్రభుత్వంపై నిరంతరం విమర్శలు గుప్పిస్తున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించినట్లు కాంగ్రెస్ వర్గాల్ లో ప్రచారం జరుగుతోంది. నిధుల విడుదల కోసం ముప్ పై వేల మందితో దీక్షకు దిగుతానని ఆయన అల్టిమేటం జారీ చేయడం రాజకీయంగా కలకలం రేపింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని హెచ్చరిస్తూ పీసీసీ చీఫ్ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం.