శ్రీకాకుళంలో తీవ్రరూపం దాల్చిన నాగావళి నదీ తీర కోత
రిపోర్టర్: సునీల్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా పెదగనగళ్లవాని పేట వద్ద నాగావళి నదీ తీరం కోతకు గురవుతోంది. నిధుల కొరత కారణంగా తాత్కాలిక రాతికట్ట పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో మత్స్యకార గ్రామాలు ప్రమాదంలో పడ్డాయి. ఇప్పటివరకు 12 మంది మృత్యువాత పడ్డారు. ఇసుక మేటల వల్ల వేటకు వెళ్లలేక మత్స్యకారులు ఉపాధి కోల్పోయి ఆందోళన చెందుతున్నారు. మిగిలిన పనులు త్వరగా పూర్తి చేసి రక్షణ కల్పిస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ హామీ ఇచ్చారు.