కోరి వివాదాలు తెచ్చుకున్నానని పోలీసుల విచారణలో యూట్యూబర్ రావణ్ పశ్చాత్తాపం

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమరావతి

నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా వీడియోలు చేసి దేశద్రోహ సెక్షన్‌ కింద అరెస్టైన యూట్యూబర్‌ రావణ్‌ను కస్టడీ మూడో రోజైన ఆదివారం గన్నవరం పోలీసులు విచారించారు. సున్నితమైన అంశాలపై అనవసరంగా స్పందించి కోరి వివాదాలు తెచ్చుకున్నానని, అలా చేయకుండా ఉండాల్సింది అంటూ ఈ విచారణలో రావణ్ పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు తెలిసింది. హిందూ దేవతలను కించపరుస్తూ వీడియోలు చేయడంపై పోలీసులు ప్రశ్నించగా మతసామరస్యం దెబ్బతినే అంశాలపై వివరణ కోరారు.