అనకాపల్లిలో ఓటర్ల జాబితా పరిశీలన: ఇంటింటి సర్వేకు కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశం
రిపోర్టర్: శివ
స్థలం: అనకాపల్లి
అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, తొలగించబడిన లక్షా తొమ్మిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది మంది ఓటర్ల స్థితిగతులపై బూత్ స్థాయి అధికారులతో ఇంటింటి పునఃపరిశీలన నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. అర్హులైన వారికి ఫారం ఆరు ద్వారా మళ్లీ అవకాశం కల్పిస్తామని, ఎన్నికల నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేసినట్లు కలెక్టర్ అనకాపల్లి వెల్లడించారు.