ఎన్నికల సంఘం తీరుపై రాహుల్ గాంధీ ధ్వజం: బీజేపీకి తొత్తుగా మారారని ఫైర్
రిపోర్టర్: గోపి
స్థలం: New Delhi
ఫారమ్ 6 మార్పుల విషయంలో ఎన్నికల సంఘం అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ అగ్రనేత Rahul Gandhi తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, జ్ఞానేశ్ కుమార్ తన పదవిని దుర్వినియోగం చేస్తూ బీజేపీకి మేలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంపై జరుగుతున్న ఈ దాడులకు పాల్పడిన వారందరినీ బాధ్యులను చేస్తామని, త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటారని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.