నల్లగొండలో దసరా వేడుకల కలకలం: తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపిన నేత

రిపోర్టర్: గోపి స్థలం: నల్లగొండ

నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలో దసరా వేడుకల సందర్భంగా తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపిన బీఆర్ఎస్ నాయకుడు చింతల సోమయ్యపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. జమ్మి చెట్టు వద్ద పూజా కార్యక్రమంలో తన వద్ద ఉన్న ఆయుధంతో హల్ చల్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆయన నుంచి రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు.