రెండు వేల ఇరవై ఏడు ప్రపంచకప్ టార్గెట్‌గా రోహిత్ కోహ్లీ వన్డే ప్రయాణం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తిరువనంతపురం
రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా చేసుకుని సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముందుకు సాగుతున్నారని భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తెలిపారు. టెస్టులు, టీవంటీలకు దూరమైన ఈ దిగ్గజాలు కేవలం వన్డేలపైనే పూర్తి దృష్టి సారించారని ఆయన పేర్కొన్నారు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్ సందర్భంగా వీరిద్దరి అనుభవం జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని, యువ ఆటగాళ్లకు ఇది గొప్ప అవకాశమని ఆయన స్పష్టం చేశారు.