అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్

రిపోర్టర్: కృష్ణ స్థలం: లండన్

ఇంగ్లండ్ సీనియర్ పేసర్ మార్క్ వుడ్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. గత కొంతకాలంగా గాయాలతో బాధపడుతున్న 36 ఏళ్ల మార్క్ వుడ్, వైద్యుల సలహా మేకు అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించారు. 2015లో అరంగేట్రం చేసిన ఆయన తన 11 ఏళ్ల కెరీర్ లో 38 టెస్టులు, 70 వన్డేలు, 38 టీ20లు ఆడి మొత్తం 253 వికెట్లు పడగొట్టారు. 2019 వన్డే ప్రపంచకప్, 2022 టీ20 ప్రపంచకప్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు.