ఇరాన్ అధ్యక్షుడితో భారత షియా మతగురువుల కీలక భేటీ

రిపోర్టర్: సునీల్ స్థలం: New Delhi

ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌ను న్యూఢిల్లీలో భారత షియా పర్సనల్ లా బోర్డ్ ప్రధాన కార్యదర్శి మౌలానా యసూబ్ అబ్బాస్ కలిశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయాలని కోరారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ శాంతిని పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు. మరోవైపు మౌలానా కల్బే జవాద్ నఖ్వీ కూడా పెజెష్కియన్‌తో సమావేశమై ఇరాన్ ప్రజల పోరాట స్ఫూర్తిని ప్రశంసించారు.