యాప్ సాయంతో వృద్ధుడిని కాపాడిన బీహార్ యువకుడు
రిపోర్టర్: విజయ్
స్థలం: Punjab
పంజాబ్‌లోని లూథియానా జిల్లా ఫతేగఢ్ గుజ్రాన్ గ్రామానికి చెందిన వృద్ధుడు చమన్ లాల్ అమృత్‌సర్ యాత్రకు వెళ్లి జ్ఞాపకశక్తి లోపంతో దారి తప్పి ఏకంగా 1200 కిలోమీటర్ల దూరంలోని బీహార్ గయకు చేరుకున్నారు. అక్కడ స్థానికుడు నీరజ్ ఆయనను గుర్తించి తన ఇంటికి చేర్చి కృత్రిమ మేధ చాట్‌జీపీటీ సహాయంతో వివరాలు తెలుసుకుని సురక్షితంగా పంజాబ్‌లోని కుటుంబ సభ్యులకు అప్పగించారు.