పాకిస్థాన్లోని కరాచీలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
రిపోర్టర్: శివ
స్థలం: పాకిస్థాన్
పాకిస్థాన్లోని కరాచీలో భారతీయ మూలాలున్న నాయక్ కుటుంబం తరతరాలుగా వినాయక చవితి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తోంది. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో భాగంగా, ఈ కుటుంబం స్వయంగా ఐదు అడుగుల గణేశుడి విగ్రహాన్ని తయారు చేసి పూజలు నిర్వహించింది. విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో స్థానిక ముస్లింలు కూడా పాల్గొని సహాయం చేయడం విశేషం.