'భవిష్యత్తు కోసం ఏఐ విద్య': త్రిపుర ప్రభుత్వ సరికొత్త నిర్ణయం
రిపోర్టర్: హరి
స్థలం: త్రిపుర
పాఠశాల విద్యార్థుల్లో కృత్రిమ మేధస్సు (ఏఐ) నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో త్రిపుర ప్రభుత్వం 'ఏఐ ఉత్సవ్ - స్కిల్ కాంపిటీషన్ 2026' కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుండి పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థులకు స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ ద్వారా ఉచితంగా ఏఐ కోర్సులు అందించనున్నారు. నైపుణ్యాభివృద్ధి శాఖ డైరెక్టర్ ప్రదీప్ కృష్ణరాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ వినూత్న కార్యక్రమం ద్వారా సుమారు 1,920 పాఠశాలలను కవర్ చేసి విద్యార్థులకు జాతీయ సర్టిఫికెట్లు అందజేయనున్నారు.