ఢిల్లీలో మణిపూర్ గిటారిస్ట్ దారుణ హత్య, నిరసనలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: New Delhi

ఢిల్లీలో మణిపూర్‌కు చెందిన ప్రముఖ గిటారిస్ట్ చోంగ్తామ్ విక్రమ్ సింగ్ (55) మద్యం మత్తులో ఉన్న ఎనిమిది మంది దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఇంటి ముందు గొడవ చేస్తుండగా అడ్డుకున్నందుకు ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు, కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.