అన్నాదొరై ఆశయాలను విస్మరించని తమిళనాడు రాజకీయ యోధులు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: నగరి
నగరి నియోజకవర్గంలో ద్రావిడ ఉద్యమ నాయకుడు పేరరిజ్ఞర్ అన్నా 118వ జయంతి వేడుకలను ఏఐఏడిఎంకే నాయకులు ఘనంగా నిర్వహించారు. పుదుపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో తిరుత్తణి ఎమ్మెల్యే హరి ముఖ్య అతిధిగా పాల్గొని నివాళులర్పించారు. అన్నా సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన కృషిని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి. అంబ్రోస్ విల్సన్, ఆర్. ధర్మరాజన్, ఎస్. ముత్తుకుమారన్ తదితరులు పాల్గొన్నారు.