గుంటూరు జిల్లాలో విచిత్ర పరిస్థితి: రెండు మండలాలుగా అలీనగర్ వీధులు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: గుంటూరు
గుంటూరు జిల్లా దుగ్గిరాల సమీపంలోని అలీనగర్ ప్రాంతం రెండు మండలాల పరిధిలోకి వస్తుండటంతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. రోడ్డుకు కుడివైపు దుగ్గిరాల మండలం, ఎడమవైపు తెనాలి మండలం ఉండటంతో వివిధ అవసరాల నిమిత్తం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు ఆరు దశాబ్దాల క్రితం నాటి అధికారుల నిర్ణయం వల్ల ఈ విచిత్ర సమస్య ఉత్పన్నమైందని అధికారులు తెలిపారు.