సోషల్ మీడియాలో సితార సందడి: తెలంగాణ యాసలో మాట్లాడుతూ నెటిజన్లను ఆకట్టుకున్న వైనం

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని అచ్చమైన తెలంగాణ యాసలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫహాద్ ఫాజిల్ నటించిన డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆమె మ్యాజిక్ చేసే పాత్రధారితో కలిసి ఓ వీడియోలో కనిపించారు. ఆగు ఇటు రా అంటూ సితార మాట్లాడిన తీరు చాలా సహజంగా ఉందని, ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోందని నెటిజన్లు పేర్కొన్నారు.