స్మార్ట్ హోమ్ డిస్‌ప్లేను త్వరలో విడుదల చేయనున్న ఆపిల్
రిపోర్టర్: సురేష్
స్థలం: ఇండియా
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ త్వరలోనే తన తొలి స్మార్ట్ హోమ్ డిస్‌ప్లేను మార్కెట్లోకి తీసుకురానుందని ప్రముఖ బ్లూమ్‌బెర్గ్ నిపుణుడు మార్క్ గుర్మన్ వెల్లడించారు. జె490 కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్న ఈ పరికరం సిరి ఏఐ ఆధారంగా పనిచేస్తుందని, ఫేస్ ఐడీ ఫీచర్ తో పాటు పలు అధునాతన హంగులతో ఇది రూపుదిద్దుకుంటుందని సమాచారం.