ఓట్ల తొలగింపుపై కేంద్రం తీరును తప్పుబట్టిన సీఎం రేవంత్ రెడ్డి
రిపోర్టర్: రాము
స్థలం: ఢిల్లీ
ఓట్ల చోరీకి పాల్పడుతున్న బీజేపీ అధికారంలో నుంచి గద్దె దిగే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న ఓట్ బచావో దేశ్ బచావో మార్చ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల ఓట్లను తొలగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఓట్ల హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్త ఉద్యమం ఉధృతం చేస్తామని తెలిపారు.