వినాయక చవితికి అజయ్ అరసాడ ప్రత్యేక ప్రైవేట్ సాంగ్ విడుదల
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తెలంగాణ
ప్రముఖ సంగీত దర్శకుడు అజయ్ అరసాడ వినాయక చవితి సందర్భంగా 'బోలో గణపతి ఎస్/ఓ ఉమాపతి' అనే ప్రైవేట్ సాంగ్‌ను విడుదల చేశారు. తన సొంత మ్యూజిక్ లేబుల్ 'AjA రికార్డ్స్' పై ఈ పాటను నిర్మించారు. భాస్కర్ తిరుమల సాహిత్యం అందించిన ఈ పాటకు ట్రెండీ బీట్స్‌తో క్లాస్‌గా సంగీతం అందించారు. ఈ పాట పందిళ్లలో అలరించడానికి సిద్ధమైంది.