మంచిర్యాలను కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ నేతల గర్జన

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని, నిత్యావసర ధరలను నియంత్రించాలని కోరుతూ సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఎల్నినో ప్రభావంతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ పదో తేదీన నిర్వహించనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి, నిత్యావసర వస్తువులను ఉచితంగా సరఫరా చేయాలని పార్టీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు.