వైట్‌హౌస్ లో ఘనంగా దీపావళి వేడుకలు: ట్రంప్ కు హనుమాన్ చాలీసా బహూకరణ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Washington
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ లో దీపావళి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించినట్లు ప్రముఖ టెక్ ప్రెన్యూర్ విశాల్ గోండల్ వెల్లడించారు. ఈ వేడుకల్ లో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసిన ఆయన, ధైర్యానికి ప్రతీకగా నిలిచే హనుమాన్ చాలీసా ప్రతిని కానుకగా అందజేశారు. ఓవల్ ఆఫీస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు భారతీయ ప్రముఖులు, షెఫ్ వికాస్ ఖన్నా పాల్గొని ప్రమిదలు వెలిగించారు.