నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న నాని ది ప్యారడైజ్ ఓటీటీ రైట్స్
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన రా యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని భాషల డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం ప్రసారమయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.