ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంపై సుప్రీంకోర్టు భిన్నాభిప్రాయ తీర్పు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: న్యూఢిల్లీ
ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి ప్రధాన న్యాయమూర్తిని తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం భిన్నాభిప్రాయంతో కూడిన తీర్పు వెలువరించింది. జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ ఎస్సీ శర్మల ధర్మాసనం ఎన్నికల కమిషనర్ల చట్టం 2023 రాజ్యాంగబద్ధతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. అటు విస్తృత ధర్మాసనానికి కేటాయింపుపై ఇరువురు న్యాయమూర్తులు విభేదిస్తూ భిన్నమైన ఉత్తర్వులు జారీ చేయగా సంస్థాగత ఐక్యత దృష్ట్యా ఏకగ్రీవ తీర్పు వచ్చి ఉంటే బాగుండేదని జస్టిస్ దీపాంకర్ దత్తా విచారం వ్యక్తం చేశారు.