స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్: బొబ్బిలి, రాజాం మున్సిపాలిటీలకు రాష్ట్రస్థాయి పురస్కారాలు
రిపోర్టర్: రాము
స్థలం: విజయనగరం
స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026లో బొబ్బిలి, రాజాం మున్సిపాలిటీలు రాష్ట్రస్థాయి అవార్డులు సాధించడం ఆనందంగా ఉందని కలెక్టర్ విజయనగరం (Collector Vizianagaram) తెలిపారు. ఈ ఘనత సాధించిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలు మరియు స్థానిక యంత్రాంగం నిరంతరం చేస్తున్న కృషి ఫలితంగానే ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ పరిశుభ్రతలో జిల్లాను మరింత ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.