రెండేళ్ల తర్వాత స్టేజ్ పైకి వచ్చిన ప్రఖ్యాత గాయని సెలిన్ డియాన్

రిపోర్టర్: రమేష్ స్థలం: World

ప్రఖ్యాత గాయని సెలిన్ డియాన్ రెండేళ్ల విరామం తర్వాత పారిస్ లో జరిగిన సంగీత కచేరీతో మళ్లీ వేదికపైకి వచ్చారు. అరుదైన ఆరోగ్య సమస్య కారణంగా సుదీర్ఘకాలం పాటు దూరంగా ఉన్న ఆమె, తొలి ప్రదర్శనలోనే భావోద్వేగానికి గురై కన్నీటిపర్యమమయ్యారు. అభిమానుల ఆదరాభిమానాల మధ్య మళ్లీ పాటలు పాడుతూ స్టేజ్ పైకి రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.