విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ కిటకిట: బస్సుల కోసం గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయనగరం
దసరా పండుగ సందర్భంగా విజయనగరం ఆర్టీసీ సముదాయం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. చీపురుపల్లి, రాజాం, పార్వతీపురం, బొబ్బిలి ప్లాట్‌ఫారాలపై రద్దీ విపరీతంగా పెరిగింది. చిన్నపిల్లలు, వృద్ధులు బస్సులు ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగినన్ని ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని, రద్దీని ఎప్పటికప్పుడు నియంత్రిస్తున్నామని డివిజనల్ మేనేజర్ జె.శ్రీనివాసరావు స్పష్టం చేశారు.