రాజస్థాన్ పురపాలక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ
రిపోర్టర్: రాజేష్
స్థలం: రాజస్థాన్
రాజస్థాన్ పురపాలక ఎన్నికల్లో అధికార బీజేపీ ఘన విజయం సాధించి తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. సీఎం భజన్ లాల్ శర్మ పాలన, యువతకు ఉద్యోగాలు, పేపర్ లీకేజీల నిరోధక చర్యలే ఈ విజయానికి దోహదపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాల కారణంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ చారిత్రాత్మక విజయంపై సీఎం భజన్ లాల్ శర్మతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు.