గుజరాత్లో దేశ తొలి ఎల్ఎన్జీ రైలును ప్రారంభించిన అమిత్ షా

రిపోర్టర్: సురేష్ స్థలం: అహ్మదాబాద్

గుజరాత్లోని సబర్మతి స్టేషన్లో దేశంలోనే తొలి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారని అధికారులు తెలిపారు. రూ.1,500 కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టిన పలు రైల్వే అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత రైల్వే వ్యవస్థలో భారీగా ఆధునిక మార్పులు జరిగాయని, 2030 నాటికి డీజిల్ వినియోగాన్ని పూర్తిగా సున్నాకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని షా స్పష్టం చేశారు.