నెల్లూరులో రేషన్ దుకాణాల మోసాలపై కార్డుదారుల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: నరేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలోని చౌక ధరల దుకాణాల్లో సరకులు తక్కువ తూకం వేస్తూ కార్డుదారులను మోసం చేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. నరసింహులు అనే స్థానికుడు రేషన్ దుకాణంలో పదిహేను కిలోల బియ్యం తీసుకోగా బయట తూకం వేస్తే పద్నాలుగు కిలోలే ఉన్నాయని వాపోయారు. తనిఖీలు చేయాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితం కావడంతో ప్రజలు నష్టపోతున్నారని, అధికారులు తక్షణమే స్పందించి అక్రమాలను అరికట్టాలని నెల్లూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.