గుర్గావ్లో మహిళా బైకర్పై దాడి: హత్యాయత్నం కేసులో త్వరలో చార్జ్షీట్

రిపోర్టర్: శివ స్థలం: Gurgaon

మహిళా బైకర్ శివానీ చౌహాన్ ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ను నిందితుడు కల్యాణ్ బైస్లా ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టాడని దర్యాప్తులో తేలిందని ఏసీపీ సుశీల వెల్లడించారు. సెప్టెంబర్ 13న జరిగిన ఈ ఘోర ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ పూర్తి చేసిందని తెలిపారు. నిందితుడిపై హత్యాయత్నం సహా అన్ని సెక్షన్ల కింద వారంలోగా కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.