పాలకొండలో కూటమి సంక్షేమ నినాదంతో జోరుగా ఇంటింటి ఎన్నికల ప్రచారం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: పాలకొండ

పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఇరవై ఒకటవ వార్డులో కూటమి అభ్యర్ధి బోగాది వెంకటరమణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆదేశాల మేరకు మేయర్ అభ్యర్ధికి గ్లాస్ గుర్తుపై, కౌన్సిలర్ అభ్యర్ధికి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి భారీ విజయాన్ని అందించాలని అభ్యర్థించారు.