గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదును పరుగులు పెట్టించాలని ఖమ్మంలో పువ్వాడ అజయ్ పిలుపు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం వన్టౌన్ పరిధిలోని ముస్తఫా సెంటర్లో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. మాజీ కార్పొరేటర్ మక్బూల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఓటరు నమోదును వేగవంతం చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా నాయకులు ఎండీ వై. పాషా తదితరులు పాల్గొన్నారు.