ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఇందుకూరుపేటలో ఆశీర్వాద దీపాల వెలుగులు
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఇందుకూరుపేట
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని భాజపా మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి పిలుపు మేరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో ప్రజలు తమ ఇళ్ల వద్ద ఆశీర్వాద దీపం వెలిగించారు. ఈ సందర్భంగా కైలాసం శ్రీనివాసులు రెడ్డి తన నివాసంలో దీపం వెలిగించి, మోదీ ఆయురారోగ్యాలతో కలకాలం దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.