'రేవంత్ కుటుంబానికి 308 ఎకరాలున్నాయి': సీఎంపై హరీశ్ రావు సంచలన ఆరోపణలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: Hyderabad

సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని, కేవలం గంటన్నరలోనే తమకు సమాచారం వచ్చిందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్, ఆయన తమ్ముళ్లు, బిడ్డకు ఉన్న భూముల పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు వచ్చాయని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని చెబుతూ ఫ్యూచర్ సిటీ చుట్టూ భూముల కేటాయింపులపై తీవ్ర విమర్శలు గుప్పించారు.