వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డికి 14 రోజుల రిమాండ్
రిపోర్టర్: Darla Venkateswarlu
స్థలం: పెళ్లకూరు
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి గురువారం నాయుడుపేట కోర్టులో లొంగిపోయారు. ఓ వ్యక్తి మృతి చెందిన ఘటనకు సంబంధించి ఆయనపై సెక్షన్ ముప్పై రెండు కింద కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, కోర్టు విచారణ అనంతరం ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.