సెప్టెంబర్ 27 ఆదివారం నాడు బ్యాంకులు తెరిచి ఉంటాయని వెల్లడి
రిపోర్టర్: పి రాజేష్ కుమార్
స్థలం: గంగాధర నెల్లూరు
సెప్టెంబర్ 28 నుండి 30 వరకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, పౌరుల బ్యాంకింగ్ అవసరాలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. సెలవు దినమైన సెప్టెంబర్ 27 ఆదివారం నాడు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణ పనివేళల్లో పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసింది. అత్యవసర సేవల అంతరాయాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.