గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి: తల్లోజు ఆచారి పిలుపు

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు చేసుకోవాలని బీజేపీ నేత తల్లోజు ఆచారి పిలుపునిచ్చారు. డిగ్రీ పూర్తయిన వారు ఫారం పద్దెనిమిది ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.