తల్లిని అవమానించడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అంటూ విమర్శలు

రిపోర్టర్: సురేష్ స్థలం: Hyderabad

విద్యార్థుల కార్యక్రమం పేరుతో నిర్వహించిన వేదికపై ఓ తల్లిని అవమానించడం కాంగ్రెస్‌ రాజకీయ సంస్కృతికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాలు వేరుగా ఉంటాయని, కానీ మహిళలను మరియు తల్లులను గౌరవించడం కనీస బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కనీస సంస్కారాన్ని కూడా మరిచిపోవడమే కాంగ్రెస్‌ పార్టీ విధానమా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.