తులసీదాస్ జీవితం ఆధారంగా 'రామ్‌బోలా' చిత్రం ప్రకటన

రిపోర్టర్: గోపి స్థలం: India

భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కథలను వెండితెరపై ఆవిష్కరించే క్రమంలో దర్శకుడు విశాల్ చతుర్వేది మహాకవి గోస్వామి తులసీదాస్ జీవితం ఆధారంగా 'రామ్‌బోలా' అనే చిత్రాన్ని ప్రకటించారు. మహావీర్ జైన్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ తులసీదాస్ ఆధ్యాత్మిక పరిణామం, భక్తి మార్గం, సాహిత్య సేవను ప్రతిబింబించేలా తెరకెక్కనుంది. త్వరలోనే నటీనటులు, షూటింగ్ వివరాలు వెల్లడించనున్నారు.