విద్యార్థులకు అలర్ట్: ఐఐఎం క్యాట్ అడ్మిట్ కార్డుల విడుదల తేదీ వాయిదా
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐఐఎం క్యాట్ పరీక్ష అడ్మిట్ కార్డుల విడుదల తేదీని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వాయిదా వేసింది. ఈ మేరకు నవంబర్ ఆరో తేదీన అధికారిక వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు సంస్థ వర్గాలు స్పష్టం చేశాయి. నవంబర్ 29న ఈ ప్రవేశ పరీక్ష జరగనుండగా, అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.