భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలోని ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విశాఖపట్నం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉపాధ్యాయులు విధులకు హాజరుకావాలని, అత్యవసర పరిస్థితుల కోసం అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.