హైదరాబాద్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరు
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హైదరాబాద్‌లో అధికారికంగా పర్యటించనున్నారు. సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నగరంలోని పోలీస్ అమరవీరుల స్మృతి స్థూపాన్ని సందర్శించి నివాళులర్పిస్తారని, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.