'కార్పొరేట్ స్థాయిలో హైటెక్ బస్టాండ్లు': తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో ప్రజారవాణా వ్యవస్థను ఆధునీకరించే దిశగా ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి వినూత్న ఆలోచనతో రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాల్లో కార్పొరేట్ స్థాయి హంగులతో మోడల్ బస్టాండ్లను నిర్మించేందుకు రవాణా శాఖ ఆమోదం తెలిపింది. తొలివిడతగా నాగర్కర్నూల్, రేగొండ, హుజూర్ నగర్, కోదాడ, కొడంగల్, కోస్గి, మద్దూరు, కేసముద్రం, హుస్నాబాద్, ములుగు, మధిర, నల్గొండ, కొత్తగూడెం ప్రాంతాల్లో మల్టీప్లెక్స్ హంగులు, ఫుడ్ కోర్టులు, షాపింగ్ కాంప్లెక్స్లతో కూడిన ఈ హైటెక్ బస్ స్టేషన్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.