గుజరాత్లో ముప్పై నిమిషాల్లో ఇరవై ఎనిమిది లడ్డూలు తిన్న వ్యక్తి
రిపోర్టర్: హరి
స్థలం: గుజరాత్
గుజరాత్ రాష్ట్రం సురేంద్రనగర్ జిల్లా తంగఢ్ తాలుకాలో నిర్వహించిన లడ్డూలు తినే పోటీలో ఓరి గ్రామానికి చెందిన బల్వంత్భాయ్ అద్భుత ప్రతిభ కనబరిచారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో రూరల్ ఒలింపిక్స్ పేరిట జరిగిన ఈ పోటీలో ఆయన 30 నిమిషాల వ్యవధిలో 28 లడ్డూలు తిని ప్రథమ స్థానంలో నిలిచారు. గతేడాది కూడా విజేతగా నిలిచిన ఆయన, ఈసారి కూడా బహుమతిగా రూ. 2000 నగదు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.