పా. రంజిత్ వేట్టువం సినిమా: వచ్చే సంక్రాంతికి భారీ విడుదల

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రం వేట్టువం సినిమాను వచ్చే సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ఆర్య, శోభిత ధూళిపాళ్ల కీలక పాత్రల్ లో నటిస్తున్నారని, విభిన్న సమూహాల సంఘర్షణల నేపథ్యంలో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోందని చిత్ర యూనిట్ వెల్లడించింది.