సికింద్రాబాద్ నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆంగన్ మిలన్ సేవా పేరుతో సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి పర్యటించారు. బీజేజేఆర్ నగర్, సుభాష్ నగర్ అలాగే బీకే గూడలోని అంగన్వాడీ కేంద్రాలను ఆయన స్వయంగా సందర్శించారు. అక్కడ చిన్నారులు, తల్లులు మరియు అంగన్వాడీ కార్యకర్తలతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నట్లు కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు.