మత్స్యకార కుటుంబాలకు యాభై కిలోల ఉచిత బియ్యం అందజేత
రిపోర్టర్: రాజేష్
స్థలం: Amaravati
తీవ్ర వాయుగుండం కారణంగా సముద్రంలో వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఉపాధి కోల్పోయిన అర్హులైన ప్రతి కుటుంబానికి యాభై కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. విదేశాల నుంచి టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరాంధ్ర వరదలు మరియు భారీ వర్షాల పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.