కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండంతో భారీ వర్షాలు
రిపోర్టర్: హరి
స్థలం: శ్రీకాకుళం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో అర్ధరాత్రి తీరం దాటిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ తుఫాను ప్రభావంతో విశాఖపట్నం, శ్రీకాకుళం సహా ఉత్తర కోస్తా జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సముద్రం అలజడిగా ఉన్నందున సెప్టెంబర్ 27 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.