అమిత్ షా పర్యటనపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ సభల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. విభజన హామీలు నెరవేర్చకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేయడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని అమిత్ షాకు ఆయన సవాల్ విసిరారు.